గరుడవేగ డైరక్టర్ తో నితిన్..!

ఓ సినిమా హిట్ కొడితే ఆ వెంటనే అవకాశాలు అందుకోవడం పెద్ద కష్టమేం కాదు. చిన్న సినిమాలతో ప్రయత్నం మొదలు పెట్టి ఈరోజు గరుడవేగతో ఇండస్ట్రీని మొత్తం షేక్ చేసిన దర్శకుడు పవీణ్ సత్తారు తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. అసలు ఏమాత్రం మార్కెట్ లేని రాజశేఖర్ తో హిట్ అందుకున్న ప్రవీణ్ సత్తారు తన తర్వాత సినిమా నితిన్ తో చేస్తున్నాడని టాక్.

ఇప్పటికే గోపిచంద్ బయోపిక్ లో సుధీర్ బాబుతో సినిమా తీయాలని ఫిక్స్ అయిన ప్రవీణ్ దానికి ముందే నితిన్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. గరుడవేగ సక్సెస్ తో నితిన్ పిలిచి మరి అవకాశం ఇచ్చాడట. తన సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ లోనే ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. అయితే అందులో హీరోగా నితిన్ నటిస్తాడా లేదా అన్నది డౌట్ అంటున్నారు. మరి నితిన్ నిర్మాణంలోనే అయితే మరో యువ హీరో అందులో నటించే అవకాశం ఉంటుంది. మొత్తానికి గరుడవేగతో తన కెరియర్ లో ఉత్సాహం నింపుకున్నాడు ప్రవీణ్ సత్తారు.