రాజశేఖర్ కు ఇప్పుడు బుద్ధి వచ్చింది..!

గరుడవేగ సక్సెస్ లో ఉన్న రాజశేఖర్ కు ఓ కొత్త సమస్య వచ్చి పడింది. సినిమా హిట్ అయ్యింది ఓకే కాని ఈ హిట్ బాలయ్య వల్ల వచ్చింది అని నందమూరి ఫ్యాన్స్ అంటుంటే సినిమా రిలీజ్ ముందు చిరంజీవిని కలిశాడు కాబట్టి మెగా ఫ్యాన్స్ మాత్రం మెగాస్టార్ వల్లే ఈ సినిమా హిట్ అయ్యింది అంటున్నారు. ఇక రాజశేఖర్ సినిమా కోసమే చిరంజీవిని కలిశాడని ఇప్పటికి కాని రాజశేఖర్ కు బుద్ధి వచ్చిందని వార్తలు రాశారు.

అసలు చిరంజీవితో గొడవ జరిగిన కొద్ది రోజుల్లోనే ఆ వివాదం ముగిసిందని.. ఆ తర్వాత చాలా సార్లు తాను చిరంజీవిని కలిశానని అన్నారు రాజశేఖర్. కేవలం ఈ సినిమాకు ముందే కలిశామని వార్తలు రావడం కాస్త బాధించాయని అన్నారు. చిరంజీవి గారు సినిమా సక్సెస్ అవ్వాలని చాలా జాగ్రత్తగా చెప్పారు. ఆయన సపోర్ట్ మా సినిమాకు ఎంతో ఉపయోగపడిందని అన్నారు. మొత్తానికి ఓ వైపు బాలయ్య, మరో పక్క చిరు సాయంతో గరుడవేగ గట్టెక్కేలా చేసుకున్నాడు రాజశేఖర్.