మహేష్ తో మల్టీస్టారర్ కు సిద్ధమట..!

సూపర్ స్టార్ తో మల్టీస్టారర్ అంటే ఏ హీరో మాత్రం కాదంటాడు చెప్పండి. వారిలో మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ కూడా చేరాడు. మహేష్ తో మల్టీస్టారర్ చేసేందుకు తాను సిద్ధం అని చెప్పాడట. అసలు ఈ టాక్ ఎలా వచ్చింది అంటే దిల్ రాజు మనవడు అర్చిత్ పుట్టినరోజు వేడుకలలో సరదా సంభాషణల్లో ఈ కాంబోపై డిస్కషన్స్ చేశారట.

మహేష్, సాయి ధరం తేజ్, కళ్యాణ్ రాం లు ఈ వేడుకకు అటెండ్ అవగా దిల్ రాజు క్యాంప్ లోని దర్శకులు హరిష్ శంకర్, వంశీ పైడిపల్లి కూడా వచ్చారట. ఇక మాటల సందర్భంలో మల్టీస్టారర్ ప్రస్తావన రాగా మహేష్ ను సాయి ధరం తేజ్ తో మల్టీస్టారర్ చేస్తా అంటే మంచి కథ ఉంటే చెప్పు చేసేస్తా అన్నాడట. ఇక ఇదే విషయం తేజ్ ను అడుగగా నేను కూడా రెడీ అంటూ చెప్పుకొచ్చాడట. నలుగు సినిమా వాళ్లు కలిస్తే ఓ క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుంది అంటే కచ్చితంగా అది మంచి జరుగుతుందని చెప్పొచ్చు.