తొక్కేవాళ్ల తాట తీస్తా..!

మంచు మనోజ్ హీరోగా ఒక్కడు మిగిలాడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. తను నటించిన ఒక్కడు మిగిలాడు టైంలో జరిగిన సంఘటనలు, తెలుసుకున్న విషయాల పట్ల సమాజంలోకి వెళ్లి ఏదో ఒకటి చేసేయాలని నిర్ణయించుకున్నా అందుకే సినిమాలకు గుడ్ బై చెబుతున్నా అని ట్వీట్ చేశా. అయితే దానికి కొంత సమయం ఉందని తెలుసుకుని మళ్లీ ఆ ట్వీట్ ను డిలీట్ చేశా అన్నాడు మనోజ్.  

సమాజంలో పెద్దోళ్లు చిన్నోళ్లను తొక్కేస్తూనే ఉన్నారు. సినిమా పరిశ్రమలో కూడా చిన్న సినిమాలకు రిలీజ్ కష్టాలు తప్పట్లేదు. కొద్దిగా టైం తీసుకున్నా మళ్లీ తాను జనాల్లోకి వస్తానని అందరి తాటా తీస్తానని అన్నారు మనోజ్. మరి మనోజ్ ఈ విధంగా మాట్లాడటానికి కారణాలు ఏవై ఉంటాయన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా మరో హీరో సమాజ శ్రేయస్సు కోసం జనాల్లోకి వస్తా అంటున్నాడు. మరి అది రాజకీయ పరంగానా లేక స్వతంత్రంగానా అన్నది తెలియాల్సి ఉంది.