
సగటు మనిషి జీవితం వారి ఎమోషన్స్ సినిమాల్లో చూపించే దర్శకులు చాలా తక్కువ. సినిమాలో మనల్ని మనం చూసుకునేలా చేసే దర్శకులు చాలా అరుదు. అలాంటి వారిలో త్రివిక్రం ఒకరు. ప్రతి సినిమాలో హీరో అనగానే కొన్ని సూప్ర్ పవర్స్ ఉంటాయి. కాని అవన్ని తన మాటలతోనే వచ్చేలా చేస్తాడు త్రివిక్రం. తీసేది స్టార్ హీరో అయినా త్రివిక్రం మార్క్ ఉంటుంది.
ప్రస్తుతం త్రివిక్రం పవన్ తో చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఇక ఆ వెంటనే ఎన్.టి.ఆర్ తో సినిమా మొదలు పెడతారట. ముహుర్త కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా కథ ఓ నవల ఆధారంగా రాసుకున్నాడని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే అఆ సినిమా కోసం యద్ధనపుడి సులోచనరాణి మీరా నవలను స్పూర్తిగా పొందిన త్రివిక్రం ఎన్.టి.ఆర్ కోసం 1980లలో వచ్చిన ఓ నవల ఆధారంగా కథ సిద్ధం చేశాడట.
ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ డిటెక్టివ్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించబోతున్న ఈ క్రేజీ మూవీలో డిజె భామ పూజా హెగ్దె ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు.