చిరుతో ఫైట్ గురించి జీవితా రాజశేఖర్..!

టాలీవుడ్ లో హీరోల మద్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయని వార్తల్లో చదువుతూనే ఉంటాం. కెరీర్ లో బాగా ఎదుగుతున్న సమయంలో తమను తొక్కేశారు.. చాన్సులు ఇవ్వకుండా చేశారని కొంత మంది హీరో, హీరోయిన్లు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో దాదాపు దశాబ్దం క్రితం మెగాస్టార్ చిరంజీవి, రాజశేఖర్ జీవితల మధ్య విభేదాలు చెలరేగాయని పుకార్లు షికార్లు చేశాయి. 

అప్పట్లో ఏ చిన్న చాన్సు దొరికినా చిరుని ఈ దంపుతులు తిట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు సీన్ మారింది. చిరంజీవి, రాజశేఖర్‌లకు పడటం లేదనేది పాత మాట. ప్రస్తుతానికి తమ మధ్య ఏ విభేదాలు లేవంటున్నారు రాజశేఖర్ జీవిత దంపతులు. తాజాగా రాజశేఖర్‌ నటించిన మూవీ గరుడ వేగ సినిమా ప్రీమియర్ షోకి మెగాస్టార్‌ని ఆహ్వానించడానికి జీవితతో కలిసి వెళ్లారు. చిరు రాజశేఖర్ ఒక్కటయ్యారనే వార్త మాత్రం సినీ అభిమానులను విపరీతంగా ఆకర్షించింది. గరుడ వేగ ప్రమోషన్స్‌లో పాల్గొన్న జీవిత ఈ విషయంపై మాట్లాడుతూ.. చిరుతో తమకెప్పుడూ ఏ రకమైన విభేదాలు లేవని అన్నారు.