
హిట్లు ఫ్లాపులు సంబంధం లేకుండా సూపర్ స్టార్ ను మహేష్ ను అభిమానించే వారు ఎంతమందో. సౌత్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మహేష్ కూడా ఒకరు. ఇక ట్విట్టర్ లో అయితే తెలుగు హీరోల్లో అత్యధికంగా 4.61 మిలియన్ ట్విట్టర్ ఫాలోవర్స్ ను సాధించాడు మహేష్. ఇక మహేష్ తర్వాత నాగార్జున, రానా 4 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించారు.
వరుస సినిమాలతో సక్సెస్ అందుకుంటున్న రానా నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకోగా సీనియర్ స్టార్ హీరోల్లో నాగార్జున సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఇక ఈ ఇద్దరు మహేష్ తర్వాత స్థానం బర్తీ చేశారు. ఇక సౌత్ లో అందరికన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న హీరో ధనుష్. దాదాపు 6 మిలియన్ ట్విట్టర్ ఫాలోవర్స్ తో టాప్ లో ఉన్నాడు ధనుష్.