బాబాయ్ తర్వాతే అబ్బాయ్..!

రాం చరణ్ సుకుమార్ కాంబోలో వస్తున్న రంగస్థలం మూవీ శాటిలైట్ హక్కులను ప్రముఖ ఛానెల్ 18 కోట్లతో దక్కించుకుందని లేటెస్ట్ టాక్. నాన్ బాహుబలి సినిమాల్లో చరణ్ సినిమా ఓ ప్రత్యేక రికార్డ్ సృష్టించింది. అయితే పవన్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అజ్ఞాతవాసి సినిమా ఏకంగా 21 కోట్లకు శాటిలైట్ అయ్యింది. ఈ లెక్కన చూస్తే బాబాయ్ ను అబ్బాయి మించలేదని చెప్పొచ్చు.

నాన్నకు ప్రేమతో తర్వాత సుకుమార్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ రంగస్థలం మూవీలో అనసూయ కూడా స్పెషల్ రోల్ లో కనిపించనుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ మూవీ అసలైతే సంక్రాంతి రిలీజ్ అనుకున్నా మార్చి 29కి పోస్ట్ పోన్ అయ్యిందని అంటున్నారు. ధ్రువ తర్వాత ఆ సక్సెస్ మేనియా కంటిన్యూ చేసేలా ఈ రంగస్థలం ఉంటుందని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అన్నది తెలియాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.