
మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా రాబోతున్న ఉయ్యాలవాడ నరసిం హారెడ్డి బయోపిక్ సైరా నరసిం హారెడ్డి సెట్స్ మీదకు వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. డిసెంబర్ మొదటి వారం నుండి రెగ్యులర్ షూట్ జరుపుకోనున్న ఈ సినిమా విషయంలో ప్రతిది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారట. మేకింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దని ఇప్పటికే మెగాస్టార్ డైరక్టర్ సురేందర్ రెడ్డికి భరోసా ఇచ్చాడని తెలుస్తుంది.
సైరా సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథ అందించగా మాటలను సాయి మాధవ్ రాస్తున్నాడట. తన మాటలతో ప్రస్తుతం ట్రెండ్ సృష్టిస్తున్న సాయి మాధవ్ సైరాకు అదిరిపోయే డైలాగులు అందిస్తున్నాడని తెలుస్తుంది. ఎంతగా అంటే డైలాగ్స్ లోనే పౌరుషం తెలిసేలా రాస్తున్నారట. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో వస్తున్న సైరా సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.