
నందమూరి బాలకృష్ణ డ్రీం ప్రాజెక్టులలో ఒకటైన నర్తనశాల టైటిల్ ను కొట్టేశాడు యువ హీరో నాగ శౌర్య. ప్రస్తుతం ఛలో సినిమా చేస్తున్న నాగ శౌర్య తన తర్వాత సినిమా టైటిల్ గా నర్తనశాల అని పెట్టబోతున్నారట. శ్రీనివాస్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది. యువ హీరోగా సక్సెస్ రేటు ఉన్నా సినిమాల సెలక్షన్స్ లో కాస్త లెట్ చేస్తున్న నాగ శౌర్య ఛలోతో పక్కా హిట్ అంటున్నాడు.
ఇక నర్తనశాల కూడా అంచనాలకు తగ్గట్టుగానే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా మహాభారతానికి సంబందించినది కాదని నర్తనశాల టైటిల్ మాత్రమే వాడుతున్నట్టు తెలుస్తుంది. మరి కాంటెంపరరీ టైటిల్ తో నాగ శౌర్య ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి. శ్రీరామరాజ్యం టైంలో నర్తనశాల సినిమా తీసేందుకు ఊపు చేసిన బాలయ్య ఎందుకో మళ్లీ వెనక్కి తగ్గాడు.
100వ సినిమాగా కూడా నర్తనశాలను తెరకెక్కించే ప్రయత్నం చేసినా అది కుదరలేదు. అందుకే శాతకర్ణిగా వచ్చి అదరగొట్టాడు. బాలయ్య పర్మిషన్ తోనే శౌర్య ఈ టైటిల్ పెట్టాడా లేక రిజిస్టర్ చేయలేదు కాబట్టి టైటిల్ వాడేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది.