వర్మ సినిమాలో నాగ్ రోల్ ఇదేనా..!

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ, నాగార్జున కలిసి మళ్లీ సినిమా చేయబోతున్నారని తెలిసిందే. ఫ్లాపుల్లో ఉన్నా సరే వర్మ అడిగాడు కాబట్టి కాదనలేకపోయాడు నాగార్జున. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కేవలం వర్మ సినిమాలో హీరోగా మాత్రమే చేస్తున్నాడు నాగార్జున. వర్మ తన కంపెనీ బ్యానర్లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో నాగార్జున రోల్ ఏంటి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేయగా ఇందులో నాగ్ మరోసారి పోలీస్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. శివమణి నాక్కొంచం మెంటల్ అంటూ చిక్కొట్టిన నాగ్ లాంగ్ గ్యాప్ తర్వాత పోలీస్ గా అది కూడా వర్మ టేకింగ్ లో వస్తున్నాడు. ఇదో రియలిస్టిక్ కథ అంటూ చెప్పి వదిలేసిన వర్మ సినిమాలో నాగ్ పోలీస్ అని తెలిసినప్పటి నుండి క్యూరియాసిటీ పెరిగింది.

తప్పకుండా నాగార్జునను మెప్పించే కథనే చెప్పి ఉంటాడని అంటున్నరు. ఒకవేళ సినిమా అటు ఇటు అయినా నాగార్జున కేవలం హీరోగానే చేస్తున్నాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఎటొచ్చి రిస్క్ లో పడేది మళ్లీ వర్మనే. సో వర్మ సినిమాలో పోలీస్ పాత్రలో సేఫ్ గేం ఆడుతున్న నాగార్జున సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.