
బాయ్స్ చిత్రంతో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో సిద్దార్థ. ఆ తర్వాత తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలతో మంచి విజయం సాధించాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవీ పెద్దగా ఆడలేదు. సిద్దార్థ తెలుగుతో పాటు తమిళ, హిందీ ఇండస్ట్రీలో కూడా నటించాడు. ప్రస్తుతం సిద్దార్థ నటించిన గృహం రిలీజ్ కావాల్సి ఉంది. కానీ డాక్టర్ రాజశేఖర్ నటించిన గరుడవేగ, హెబ్బా పటేల్ ఏంజెల్, నెక్స్ట్ నువ్వే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
నాలుగు సినిమాలు కూడా ఒకే రోజున రిలీజ్ అవుతుండటం తో థియేటర్ ల సమస్య ఏర్పడింది . సిద్దార్థ్ సినిమాకు థియేటర్ లు లభించకపోవడంతో తన సినిమాని వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాకపోతే తమిళ్ లో మాత్రం యధావిధిగా రిలీజ్ అవుతోంది.. ఇక తెలుగులో థియేటర్ లు దొరికాక రిలీజ్ చేయనున్నారు. ఆ మద్య ఈ సినిమా గురించి ఎన్నో గొప్పలు చెప్పి.. అనుకున్న టైమ్ కి రిలీజ్ చేస్తానన్న సిద్దార్థ్ పరిస్థితి గమనించి ఒక అడుగు వెనక్కి వేశాడు.