
ఈ మద్య సినిమా హీరోలు కొత్త కొత్త స్టైల్స్ తో అభిమానుల ముందుకు వస్తున్నారు. ఆ మద్య ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో స్టైలిష్ గడ్డంతో నటించిన విషయం తెలిసిందే. సాధారణంగా హీరోలు అనగా స్మార్ట్ గా గడ్డం లేకుండా అందంగా కనిపిస్తుంటారు. కానీ ఈ మద్య ట్రెండ్ మారింది.. జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ పూర్తిగా గడ్డంతోనే నటించారు. ఇక సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న రంగస్థలం 1985 కూడా రాంచరణ్ గడ్డంతోనే కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా మెగా హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్ దాదాపు ఒకే గెటప్‌లో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ తమ సినిమాల కోసం ఇద్దరూ గడ్డాలు పెంచి.. కనిపిస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఓ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ సరసన రాశీఖన్నా నటిస్తోంది. ఈ ఫోటో చరణ్ భార్య ఉపాసన తీసిందని పేర్కొన్నారు. అంతే కాదు ఉపాసనకు ధన్యవాదాలు కూడా తెలిపారు.