
ఈమధ్యనే తండ్రైన పవన్ కళ్యాణ్ తన తనయుడు పేరు గురించి అప్పట్లో మీడియా హంగామా తెలిసిందే. ఆ హంగామా చేశారు కాబట్టే తనయుడి పేరు మీద పెద్ద రిసర్చే చేశాడు పవన్. రష్యన్ అమ్మాయి కాబట్టి అక్కడ ఇక్కడ పేర్లు కలిసి వచ్చేలా పవన్ కొడుకు పేరు పెట్టారట. తెలుస్తున్న సమాచారం ప్రకారం పవన్ తన కొడుకు పేరు మార్క్ శంకర్ పవనోవిచ్ అని పెట్టారట.
పవన్ ఎన్నో విధాలుగా ఆలోచించి ఈ పేరు పెట్టాడని తెలుస్తుంది. అన్నయ్య శివ శంకర వర ప్రసాద్ ను కొడుకు పేర్లో ఉంచడం విశేషం. ఇక పవన్ కొడుకు పేరు ఇది అని బయటకు రాగానే దీనికి సంచలన దర్శకుడు వర్మ కూడా రియాక్ట్ అయ్యాడు. ఈ పేరు పెట్టినందుకు పవన్ కు సలాం అంటూ మెసేజ్ పోస్ట్ చేశాడు. క్రీస్తు పూర్వం ఆ తర్వాత ఈజిప్టు 26 యుగాల్లో ఇలాంటి పేరు ఎవరు పెట్టలేదని అన్నారు వర్మ. రష్యాలో ఓవిచ్ అన్నది కూడా కొడుకు పేరులో ఉంచడం గొప్ప విషయమని అన్నారు వర్మ.
అయితే ఈ వ్యాఖ్యలన్ని వర్మ ఎప్పటిలానే వ్యంగ్యంగా చేసినట్టుగానే ఉన్నాయి. చివరగా తన కూతురితో జరిగిన సంభాషణను చెబుతూ పవన్ ను అందరికంటే ఎక్కువ ప్రేమించేది తనే అని చెప్పడం కొసమెరుపు.