
నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా టైటిల్ జై సింహాగా నిర్ణయించారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేసి సర్ ప్రైజ్ చేశారు. కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయిన ఈ లుక్ లో బాలయ్య డ్యాషింగ్ లుక్ ఫ్యాన్స్ కు ఉత్సాహాన్ని ఇస్తుంది. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.
హరిప్రియ, నటాషాలు కూడా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శాతకర్ణికి మ్యూజిక్ అందించిన చిరంతన్ భట్ జై సింహాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. సంక్రాంతి బరిలో గర్జించేందుకు వస్తున్న బాలయ్య బాబు ఫస్ట్ లుక్ మాత్రం సినిమా మీద అంచనాలు పెంచేలా చేశాడు. వరుసగా సంక్రాంతికి రిలీజ్ సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్న బాలయ్య ఈ జై సింహాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.