
యాంగ్రీ యంగ్ మన్ డాక్టర్ రాజశేఖర్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ జెంటిల్మన్ సినిమా మిస్ అయ్యారట. ఏంటి ఇది నిజమా అని ఆశ్చర్యపోవచ్చు. అప్పట్లో మంచి ఫాంలో ఉన్న రాజశేఖర్ శంకర్ జెంటిల్మన్ టైంలోనే తనని అడగ్గా తను కమిట్ అయిన అల్లరి ప్రియుడు సినిమా వల్ల చేయలేకపోయాడట. శంకర్ అండ్ టీం 10 లక్షలు అడ్వాన్స్ ఇస్తామన్నా సారీ అనేశాడట రాజశేఖర్.
అఫ్కోర్స్ అల్లరి ప్రియుడు సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది అది తెలిసిందే. ఒకవేళ జెంటిల్మన్ సినిమా చేసుంటే మాత్రం తెలుగు తమిళ భాషల్లో రాజశేఖర్ కు ఇప్పుడున్న క్రేజ్ కన్నా ఇంకా ఎక్కువ ఫాలోయింగ్ వచ్చేదని అంటున్నారు. ప్రస్తుతం ఈ శుక్రవారం గరుడవేగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రాజశేఖర్ జెంటిల్మన్ విషయాలని బయట పెట్టారు.