
బాహుబలి 2 సినిమా అద్భుతమైన విజయం సాధించిన తర్వాత యంగ్ రెబల్ స్టార్ సుజిత్ దర్శకత్వంలో సాహో చేస్తున్నాడు. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా ప్రతి విషయంలో జాగ్రత్తలు పడుతున్నారు చిత్రయూనిట్. బాహుబలి సీరిస్ తర్వాత ప్రభాస్ కి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో తన తదుపరి చిత్రం కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. సాహో కోసం హీరో ప్రభాస్ భారీ యాక్షన్ సీన్ చేస్తున్నాడట. సుమారు 20 నిమిషాల పాటు ఆ సీన్ ఉంటుందట.
దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా దగ్గర ఆ స్టంట్ సాగుతుంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆ స్టంట్ సీక్వెన్స్‌ను డైరెక్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది. బైక్‌లు, కార్లు, ట్రక్కులతో ఆ ఛేజింగ్ సీక్వెన్స్ ఉంటుందట. కేవలం ఖలీఫా భవనం వద్దే వారం రోజుల పాటు హై ఎండ్ యాక్షన్ సీన్స్ షూట్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ హిందీ భాషల్లో వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.