నాని రేంజ్ అంటే ఇది..!

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన హిట్ మేనియా కంటిన్యూ చేస్తున్నాడు. ఒకటి రెండు కాదు ఏకంగా డబుల్ హ్యాట్రిక్ హిట్లతో జోరు కొనసాగిస్తున్న నాని ఈ ఇయర్ ఇప్పటికే రెండు సూపర్ హిట్లు అందుకోగా మరో సినిమా డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నాడు. ఇక రెమ్యునరేషన్ పరంగా ఒక్కో సినిమాకు ఇప్పుడున్న సక్సెస్ రేషియోతో చూసుకుంటే 5-6 కోట్ల దాకా వసూళు చేస్తున్న నాని ఈ ఒక్క ఏడాది 20 కోట్ల దాకా సంపాదించాడని తెలుస్తుంది.

వరుసగా హిట్ సినిమాలు పడుతుండటంతో నాని కోసం దర్శక నిర్మాతల క్యూ పెరిగిపోతుంది. ప్రస్తుతం సెట్స్ మీదే రెండు సినిమాలు ఉండగా మరో రెండు రెడీ అవుతున్నాయి. ఆ పైన రెండు డిస్కషన్స్ లో ఉన్నాయి. ఎలా లేదన్నా రోజుకి ఒక్క సినిమా 20 కోట్లు రాబట్టే హీరోల కన్నా ఒక సంవత్సరం 3 సినిమాలతో క్రేజ్ కు క్రేజ్ డబ్బుకి డబ్బు సంపాదిస్తున్న నాని ప్రస్తుతం అందరిని ఎట్రాక్ట్ చేస్తున్నాడు. నాని హవా ఇదే రేంజ్ లో కొనసాగాలని ఆశిద్దాం.