2.0 వాయిదాకు కారణాలేంటి..!

భారతీయ చలన చిత్ర రంగంలో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం రోబో 2.0.  డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన రోబో చిత్రం ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా ఇప్పుడు 2.0 రాబోతుంది. అయితే గత కొంత కాలంగా రజినీ, శంకర్ లకు సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతన్నారు. 

ఈ ఇద్దరికి 2.0 ప్రిస్టేజియస్ మూవీ అని చెప్పొచ్చు. ఎంతో ఆశగా 2.0 చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానుందని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాని ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ మూడు నెలలు వెనక్కి వెళ్లినట్టు తెలుస్తుంది. ఇటీవల జరిగిన ఆడియో ఫంక్షన్ తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన 2.0 చిత్రం రిలీజ్ వాయిదా పడుతుందనే టాక్ బయటకు రావడంతో అభిమానులకు షాకింగ్ న్యూస్.   

సీజీ వర్క్స్ పెండింగ్ లో ఉన్నందున సినిమా రిలీజ్ కాస్త వాయిదా పడుతుందేమోనని తమిళ వర్గాలు అంటున్నాయి. అసలు నిజం ఏంటో తెలియదు కాని చిత్ర యూనిట్ దీనిపై స్పందించి, కొత్త రిలీజ్ డేట్ పై అయిన క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రజనీకాంత్, అమీ జాక్సన్, అక్షయ్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్ లో నిర్మితమవుతుంది.