అర్జున్ రెడ్డి అదిరిపోయే పార్టీ

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు.  లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో చిన్న పాత్రతో ఎంట్రీ ఇచ్చి నాని నటించిన ఎవడే సుబ్రమాణ్యంలో సపోర్టింగ్ రోల్ తో మంచి గుర్తిపు తెచ్చుకున్న విజయ్ పెళ్లిచూపులు సినిమాతో అద్భుతమైన విజయం అందుకున్నాడు.  

రీసెంట్ గా అర్జున్ రెడ్డి లాంటి చిత్రాలతో సంచలన విజయాలు అందుకొని హీరోగా స్టాండ్ అయిన విజయ్ దేవరకొండ మందు పార్టీ ఇచ్చాడు. ఇప్పుడు ఇండస్ట్రీల్లో మినిమం గ్యారెంటీ హీరోగా విజయ్ దేవరకొండ దర్శక, నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ తనకు ఎంతో శ్రేయోభిలాషులైన విక్టరీ వెంకటేష్, నాని, సాయి ధరమ్ తేజ్, రానాలతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. పలు సినిమాలతో చాలా బిజీ గా ఉన్నాడు విజయ్ దేవరకొండ.