
మెగా డాటర్ నిహారిక ఒక మనసు చేయడానికి ముందే ఆన్ లైన్ లో వదిలిన ముద్దపప్పు ఆవకాయ వెబ్ సీరీస్ అలరించింది. వెబ్ సీరీస్ తో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న నిహారిక మొదటి సినిమా నిరాశ పరచింది. అయినా సరే కొద్దిపాటి గ్యాప్ తో మళ్లీ నాన్నకూచి వెబ్ సీరీస్ తో మరో ప్రయత్నం మొదలు పెట్టింది. ఈ వెబ్ సీరీస్ లో మరో సర్ ప్రైజ్ ఏంటంటే మెగా బ్రదర్ నాగబాబు నిహారిక కలిసి నటించడమే.
అబిజిత్, నిహారిక జంటగా నటిస్తున్న ఈ వెబ్ సీరీస్ నుండి నిన్న రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రనిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సీరీస్ ను నిహారిక నిర్మాణంలో వస్తుంది. సీరీస్ ట్రైలర్ తోనే ఆకట్టుకోగా రిలీజ్ అయిన 24 గంటల్లోనే 1 మిలియన్ దగ్గరగా వ్యూయర్ కౌంట్ సంపాదించింది. మరి ఈ వెబ్ సీరీస్ ఎలా ఉండబోతుందో చూడాలి.