ఎన్టీఆర్ బయోపిక్ లో కళ్యాణ్ రామ్..!

నందమూరి బాలకృష్ణ తలపెట్టిన ఎన్.టి.ఆర్ బయోపిక్ లో నందమూరి హీరోల ప్రమేయం ఉంటుందా లేదా అన్న ప్రశ్న ఫ్యాన్స్ లో ఉండేది. తేజ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు బాలయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా కాస్టింగ్ ఎలా ఉండబోతుంది అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సినిమాలో కళ్యాణ్ రాం మాత్రం నటిస్తున్నాడని తెలుస్తుంది.

హరికృష్ణ రోల్ తనయుడు కళ్యాణ్ రాం చేస్తున్నాడని లేటెస్ట్ టాక్. అంతేకాదు ఎన్.టి.ఆర్ బయోపిక్ లో చంద్రబాబుగా జగపతి బాబు నటిస్తున్నాడని తెలుస్తుంది. మరో పక్క వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాలో మాత్రం చంద్రబాబుగా జేడిని సెలెక్ట్ చేశాడు వర్మ. రెండు బయోపిక్ లలో కాస్టింగ్ మాత్రం బాగున్నాయి. మరి సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి. బాలయ్య ప్రస్తుతం చేస్తున్న జై సిం సినిమా పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తాడట.