
మలయాళ ప్రేమంతో సౌత్ అంతా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనుపమ తెలుగు ప్రేమంలో తన పాత్రే తానే చేసి అలరించింది. ఇక త్రివిక్రం డైరక్షన్ లో వచ్చిన అఆ సినిమాలో కూడా అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత శతమానం భవతి హిట్ అవగా రీసెంట్ గా రిలీజ్ అయిన రాం ఉన్నది ఒకటే జిందగి సినిమా కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
సినిమాలో హీరోయిన్ గా చేసిన అనుపమ అందరి మనసులను గెలుచుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ లో తనకో బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడని అంటుంది. అతనెవరో కాదు శర్వానంద్ అంటుంది. శతమానం భవతి సినిమాలో కలిసి నటించిన ఈ ఇద్దరు స్నేహితులు అంటున్నారు. మరి అనుపమ ఇంత ఓపెన్ గా శర్వాతో స్నేహం అంటుంది అంటే వారు స్నేహంతో ఉంటారా లేక తర్వాత స్టేజ్ కు వెళ్తారా అన్నది చూడాలి.