మహేష్ తో ఫైటింగ్ ఫిక్స్..!

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భరత్ అను నేను అఫిషియల్ గా ఏప్రిల్ 27న రిలీజ్ అని అనౌన్స్ చేశారు. అయితే అంతకుముందే ఆ డేట్ లాక్ చేసిన స్టైలిష్ స్టార్ ఆ డేట్ కు వచ్చే అవకాశం లేకనే మహేష్ రిలీజ్ ఫిక్స్ చేశాడని అనుకున్నారు. కాని చూస్తుంటే మహేష్ తో పాటే బన్ని కూడ అదే డేట్ న వచ్చేందుకు సిద్ధమయ్యాడట.

ఈ విషయాన్ని ఆ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేస్తున్న బన్ని వాసు చెప్పారు. వక్కంతం వంశీ డైరక్షన్ లో బన్ని హీరోగా వస్తున్న నా పేరు సూర్య సినిమా అనుకున్న డేట్ కే వస్తుందని ఆయన వెళ్లడించారు. సో సమ్మర్ కూడా స్టార్ వార్ జరుగబోతుందని తెలుస్తుంది. ఏప్రిల్ మిస్ అయినా మే ఉంది అనుకుంటే పొరపాటే మే నెల మహేష్ సినిమాలన్ని డిజాస్టర్లే అందుకే ఈసారి ఏప్రిల్ మిస్ అవకూడదని అనుకుంటున్నాడు. మరి రిలీజ్ టైం కు ఏ సినిమా గురించి ఎలాంటి డెశిషన్ తీసుకుంటారో చూడాలి.