
సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో భరత్ అను నేను మూవీ సెట్స్ మీద ఉండగా ఆ సినిమా తర్వాత మహేష్ వంశీ పైడిపల్లితో చేస్తున్న సినిమాకు ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను అశ్వనిదత్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా ఈ సినిమా టైటిల్స్ గా హరే రామా హరే కృష్ణ, కృష్ణా ముకుందా మురారి టైటిల్స్ వినపడుతున్నాయి.
సినిమా టైటిల్స్ పై వస్తున్న వార్తలకు దర్శకుడు వంశీ పైడిపల్లి వివరణ ఇచ్చారు. సినిమా టైటిల్స్ గా వచ్చిన రెండిటిలో ఏది తమ సినిమా టైటిల్ కాదని.. సినిమా టైటిల్ ఫిక్స్ చేయగానే ఎనౌన్స్ చేస్తామని అన్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట.