
రోబో సీక్వల్ గా శంకర్ రజిని కాంబినేషన్ లో వస్తున్న 2.0 సినిమా ఆడియో రేపు అనగా అక్టోబర్ 27న దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరుగనుంది. ఇప్పటికే చిత్రయూనిట్ అక్కడికి చేరుకోగా ఈ సినిమా ఆడియో హోస్ట్ గా తెలుగు ఆడియోకి దగ్గుబాటి రానా ఓకే అయ్యాడని తెలుస్తుంది. హోస్ట్ గా ఈమధ్యనే నెంబర్ వన్ యారి షోతో పాపులర్ అయిన రానా సినిమాల విషయంలో చెప్పాల్సిన పనిలేదు.
ఇక తమిళ ఆడియోకి ఈర్జె బాలాజి హోస్ట్ గా చేస్తున్నారని తెలుస్తుంది. ఇక బాలీవుడ్ నుండి కూడా ఈ ఆడియోకి సర్ ప్రైజ్ గెస్టులు వస్తున్నారట. దుబాయ్ లో అత్యంత భారీగా ఈ ఆడియో ప్లాన్ చేశారని తెలుస్తుంది. 450 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక దుబాయ్ వేడుకలో రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుందని సమాచారం.