షకలక శంకర్ హీరో అయ్యాడు..!

జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించిన షకలక శంకర్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. జబర్దస్త్ నుండి బయటకు వచ్చి సినిమా అవకాశాలను అందుకున్న శంకర్ కామెడీతో కితకితలు పెట్టిస్తున్నాడు. ఇక ఇప్పుడు అతన్ని హీరోగా ప్రమోట్ చేస్తూ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమానే డ్రైవర్ రాముడు. రాజ్ సత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు షకలక శంకర్.

సీనియర్ ఎన్.టి.ఆర్ నటించిన సూపర్ హిట్ సినిమా డ్రైవర్ రాముడు. ఆ సినిమా టైటిల్ తో వస్తున్న షకలక శంకర్ ఎలాంటి ఫలితం దక్కించుకుంటాడో చూడాలి. పోస్టర్ లో సీనియర్ ఎన్.టి.ఆర్ గెటప్ లోనే కనిపించి అలరించాడు శంకర్. సునీల్, శ్రీనివాస్ రెడ్డి, ఈమధ్యనే సప్తగిరి కూడా కమెడియన్ నుండి హీరోగా మారారు. వారి దారిలో హీరోగా ప్రమోట్ చేయబడిన షకలక శంకర్ ఈ డ్రైవర్ రాముడితో ఏం చేస్తాడో మరి.