అభిమాని సినిమాని చూసిన పవన్ కళ్యాణ్.!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా రావు రమేష్, నదియా, ఈశ్వరీరావు ప్రధాన పాత్రలలో నటించిన అఆ సినిమా ఇటీవలే జూన్2న విడుదలై, పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటిరోజు నుంచి హౌస్ ఫుల్ థియేటర్లతో మంచి కలెక్షన్లను రాబడుతోంది.

ఈ సినిమాను ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూసి చిత్ర యూనిట్ ను అభినందించారట. అలాగే ఈ సినిమాలోని రావు రమేష్ పాత్ర డైలాగ్స్, యాక్టింగ్ పవన్ కు తెగ నచ్చడంతో దర్శకుడు త్రివిక్రమ్ మరియు రావు రమేష్ లను ప్రత్యేకంగా అభినందించినట్లుగా తెలిసింది.

మళ్లీ సమయం దొరికితే మరోసారి ఈ సినిమా చూడాలని పవన్ కోరుకుంటున్నట్లు తెలిపారని సినీవర్గాల సమాచారం. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన అఆ సినిమాకు మిక్కీజేమేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా అఆ నిలిచిందని చెప్పుకోవచ్చు.