
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం గీతా ఆర్ట్స్-2 బ్యానర్లో పరశురాం డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత క్రాంతి మాధవ్ తో సినిమాకు సిద్ధమయ్యాడట విజయ్. ఓనమాలుతో దర్శకుడిగా పరిచయమైన క్రాంతి మాధవ్ మళ్లీ మళ్లీ ఇది రానిరోజు సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నాడు.
ఇక ఈమధ్య వచ్చిన సునీల్ ఉంగరాల రాంబాబు సినిమా ఎందుకు తీశాడో అన్నట్టుగా వచ్చింది వెళ్లింది ఎవరికి తెలియదు. అలాంటి దర్శకుడితో విజయ్ సినిమా కన్ఫాం చేశాడు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో కె.ఎస్.రామారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి ఫ్లాప్ డైరక్టర్ తో విజయ్ కెరియర్ లో రిస్క్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.