ఆ రీమేక్ కోసం రానా రవితేజ..!

కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాను తెలుగులో రీమేక్ చేయడం సర్వసాధారణమే. ఈమధ్యనే తమిళంలో సూపర్ హిట్ అయిన విక్రం వేధ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పుష్కర్ గాయత్రి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించారు. అయితే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో రవితేజ, రానా కలిసి నటిస్తున్నారని తెలుస్తుంది. 

అసలైతే ముందు ఈ సినిమాను వెంకటేష్, రానా నటించే అవకాశాలు కనిపించినా ఎందుకో ఆ కాంబో కుదరలేదు. ఇక ఇప్పుడు ఆ సినిమాకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. రానా, రవితేజ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది తెలియాల్సి ఉంది. రాజా ది గ్రేట్ తో హిట్ ట్రాక్ ఎక్కేసిన రవితేజ ప్రస్తుతం టచ్ చెసి చూడు షూటింగ్ లో ఉన్నాడు. ఇది కాకుండా మరో తమిళ సినిమా బోగన్ రీమేక్ లో కూడా రవితేజ నటిస్తున్నాడని తెలుస్తుంది.