
సూపర్ స్టార్ రజిని పా.రంజిత్ డైరక్షన్ లో వచ్చిన కబాలి సృష్టించిన సంచలనాలు తెలిసిందే. టీజర్ తోనే సినిమా రేంజ్ ఏంటో చూపించిన రంజిత్ సినిమాను ఆ రేంజ్ లో తీయకున్నా సరే ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేశాడు. అతని వర్కింగ్ స్టైల్ నచ్చి రజిని మళ్లీ అతనితోనే కాలా సినిమా చేస్తున్నాడు. ధనుష్ నిర్మాణంలో వండర్ బార్ ఫిలింస్ పతాకంలో వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.
ఏప్రిల్ 28న ఈ సినిమా రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం రజిని శంకర్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 2.0 2018 జనవరి 25న రిలీజ్ ఫిక్స్ చేయగా ఆ సినిమా వచ్చిన 3 నెలలకే రజిని కాలా రాబోతుంది. కాలాలో రంజిని డాన్ గా కనిపించనున్నాడు. కబాలి సినిమా క్రేజ్ కు తగ్గట్టు హిట్ కొట్టలేదు అందుకే ఈసారి బలమైన కథ కథనాలతో ఈ కాలాని తెరకెక్కిస్తున్నాడట పా.రంజిత్. తప్పకుండా రజిని స్టామినా ఏంటో ఈ సినిమా ప్రూవ్ చేస్తుందని అంటున్నారు.