పటాస్, సుప్రీం సినిమాలతో హిట్ అందుకున్న దర్శకుడు అనీల్ రావిపుడి ఈమధ్యనే వచ్చిన రాజా ది గ్రేట్ తో కూడా హిట్ టాక్ సొంతం చేసుకున్నాడు. కెరియర్ అటు ఇటుగా ఉన్న రవితేజకు కరెక్ట్ టైంలో హిట్ ఇచ్చాడు అనీల్ రావిపుడి. ఇక ఈ సినిమా హిట్ తో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న అనీల్ రావిపుడి తన తర్వాత సినిమా హీరోని ఫైనల్ చేశాడు.
లవర్ బోయ్ నితిన్ తో అనీల్ నెక్ష్ట్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. బెంగాల్ టైగర్ నిర్మాత రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారట. లై తో నిరాశపరచిన నితిన్ ప్రస్తుతం కృష్ణ చైతన్య డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అనీల్ రావిపుడితో ఫిక్స్ అయ్యాడు నితిన్. యువ హీరోలంతా హిట్లు కొడుతున్న నేపథ్యంలో నితిన్ ఇక నుండి సినిమాల సెలక్షన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తుంది.