
స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో పిల్లజమిందార్ అశోక్ డైరక్షన్ లో వస్తున్న సినిమా భాగమతి. యువి క్రియేషన్స్ పతాకంలో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు ఓ వన్నె తెచ్చిన స్వీటీ అనుష్క భాగమతిగా కూడా అలరిస్తుందని అంటున్నారు. బాహుబలి తర్వాత అనుష్క చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు బాగానే ఉన్నాయి.
గ్రాఫిక్స్ ప్రాధాన్యత ఉన్న ఈ భాగమతి సినిమా అసలైతే దసరాకు రిలీజ్ చేయాలని చూసినా ఎందుకో అది కుదరలేదు. దీవాళి ఛాన్స్ ను వాడుకోలేని భాగమతి మేకర్స్ డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. డిసెంబర్ మొదటి వారంలో అనుష్క భాగమతి సినిమా రిలీజ్ కాబోతుందట. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి లాంటి ప్రెస్టిజియస్ ప్రాజెక్టుల తర్వాత అనుష్క చేస్తున్న ఈ భాగమతి అమ్మడికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.