
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో జై లవ కుశ సినిమా తీసి హిట్ అందుకున్న కె.ఎస్ రవింద్ర (బాబి) తన తర్వాత సినిమా హీరో కోసం వెతకడం మొదలుపెట్టాడు. అసలైతే స్టార్ తో సినిమా తీసిన దర్శకుడితో సినిమా తీయాలని మిగతా స్టార్స్ అంతా ఉత్సాహం చూపిస్తారు. కాని బాబి విషయంలో మాత్రం అలా జరుగట్లేదు. ప్రస్తుతం స్టార్ హీరోలంతా తమ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల బాబికి ఎవరు ఛాన్స్ ఇవ్వట్లేదట.
అసలైతే రవితేజ, బన్ని ఈ ఇద్దరిలో ఒకరితో బాబి తర్వాత సినిమా చేస్తాడని తెలిసినా ఇద్దరు చెరో రెండు సినిమాలు కమిట్మెంట్ తో ఉన్నారు. వారితో చేయాలన్నా సరే ఎటు లేదన్నా సంవత్సరం ఆగాల్సిందే అని తెలుస్తుంది. ఇక మరోపక్క నానితో బాబి సినిమా అని అంటున్నారు కాని నాని కూడా వరుసగా మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు అవి అయ్యాకే బాబితో సినిమా అన్నాడట. మరి బాబి తర్వాత సినిమా హీరో ఎవరో చూడాలి.