
ప్రపంచ స్థాయిలో తెలుగోడి సత్తా ఏంటో నిరూపించిన సినిమా బాహుబలి, బాహుబలి 2. భారత దేశ సినీ చరిత్రలో అప్పటి వరకు బాలీవుడ్, కోలీవుడ్ కి మాత్రమే ఉండే రికార్డులు బాహుబలి సీరీస్ తో తుడిచిపెట్టుకు పోయాయి. ఇక బాహుబలిగా ప్రభాస్ కి పోటీగా భల్లాల దేవుడి పాత్రలలో నటిచంని దగ్గుబాటి రానాకి ఎంతో మంచి పేరు వచ్చింది. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి లీడర్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా బాహుబలి సీరీస్ లతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.
ప్రస్తుతం రానా 1945 పిరియాడికల్ మూవీలో నటిస్తున్నాడు. ఇందుకోసం గడ్డం తీయించుని పూర్తిగా కొత్త గెటప్‌లో కనిపించనున్నాడు. ఈ ఫొటోను ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. గడ్డం పోయింది... షూటింగ్‌లో ఈ కాలం నుంచి మరో కాలానికి వెళ్తున్నాం అంటూ ఫన్నీగా పోస్ట్ చేశాడు. దేశ విభజన నేపథ్యంతో 1945 సినిమా తీస్తున్నారు.