త్రిషాని తీసారా.. తప్పుకుందా..!

దశాబ్ధ కాలం క్రితం వచ్చిన ఓ క్రేజీ సినిమాకు ఇప్పుడు సీక్వల్ చేసే పనిలో ఉండగా ఆ సినిమాలో అదే హీరో అదే హీరోయిన్ ను పెట్టాలని భావించారు కాని ఏమైందో ఏమో కాని సడెన్ గా ఆ సినిమా నుండి హీరోయిన్ తప్పుకుంది. అంతేకాదు క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటూ చెప్పి మరి ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్.. ఏంటా సినిమా అంటే హరి డైరక్షన్ లో విక్రం హీరోగా రాబోతున్న సామి-2నే.

విక్రం, త్రిష జంటగా నటించిన ఆ సినిమా అప్పట్లో మంచి హిట్ అయ్యింది. ఇక ఆ సినిమా సీక్వల్ గా మళ్లీ విక్రం, త్రిష జంటగా నటిస్తారని అనుకుంటే ఆ సినిమా నుండి త్రిష వాకవుట్ చేసింది. అంతేకాదు ఆ సినిమా యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్ అని కూడా చెప్పింది. దీనికి కారణం ఆ సినిమాలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకోవడమే అంటున్నారు. త్రిష పాత్ర చాలా తక్కువ ఉండి కీర్తి సురేష్ అసలు హీరోయిన్ గా చూపించే అవకాశం ఉందని సామి-2 నుండి త్రిష తప్పుకుందని చెబుతున్నారు.