దిల్ రాజు తో రాజ్ తరుణ్ 'లవర్'..!

డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు యువ హీరో రాజ్ తరుణ్ తో చేస్తున్న సినిమా టైటిల్ గా ' లవర్' అని నిర్ణయించారు. ఈ మేరకు టైటిల్ లోగో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలా ఎలా దర్శకుడు అనీష్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా హీరోయిన్ గా హెబ్భా పటేల్ నే తీసుకునే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు. మినిమం గ్యారెంటీ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న రాజ్ తరుణ్ దిల్ రాజు బ్యానర్లో సినిమా చేయడం ఇదే మొదటిసారి. 

ఇదవరకు శతమానం భవతి సినిమా చేయాల్సి ఉన్నా ఎందుకో ఆ సినిమా మిస్ అయ్యింది. ఇక ప్రస్తుతం అనీష్ కృష్ణ చెప్పిన కథకు రాజ్ తరుణ్ ను సెట్ చేసి లవర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమాకు లిమిటెడ్ బడ్జెట్ నే కేటాయించారని తెలుస్తుంది. ఈ ఇయర్ తీసిన సినిమాలన్ని మంచి సక్సెస్ అవడంతో దిల్ రాజు మరింత ఉత్సాహంతో సినిమాలను నిర్మిస్తున్నాడు.