
జబర్దస్త్ షోతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న రష్మి గౌతం ఆ షోతో నుండి సిల్వర్ స్క్రీన్ కు ప్రమోట్ అయ్యింది. మొదట వెండితెర మీద అదృష్టం పరిక్షించుకున్న అమ్మడు ఆ తర్వాత స్మాల్ స్క్రీన్ కు పరిమితమైంది. గుంటూర్ టాకీస్ తో హాట్ ఇమేజ్ సంపాదించిన అమ్మడు ఆ తర్వాత కూడా అదే తరహా పాత్రల్లో కనిపిస్తుంది. అందుకే ఆమెను అందరు సెక్స్ బాంబ్ అనేస్తున్నారు. ప్రేక్షకులు తనని అలా చూడాలనుకుంటున్నారు కనుక తను చేస్తున్నా అంటుంది రష్మి.
అంతేకాదు అవకాశం వస్తే సిల్క్ స్మిత, జ్యోతి లక్ష్మిగా కూడా నటించేందుకు సిద్ధమే అంటుంది. ఇంత చేసినా హాట్ ఇమేజ్ కాస్త ఇబ్బంది కరంగానే ఉంది అంటుంది అమ్మడు. ప్రస్తుతం ఆది హీరోగా ప్రభాకర్ డైరక్షన్ లో వచ్చిన నెక్ష్ట్ నువ్వే సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసిన అమ్మడు తెలుగులో ఇంకా క్రేజ్ సంపాదించాలని చూస్తుంది. ప్రస్తుతం తెలుగుతో పాటుగా తమిళ సినిమాల్లో కూడా నటిస్తుంది రష్మి.