మహేష్ 25 టైటిల్ ఇదేనా..?

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా చేస్తున్నాడు. భరత్ అను నేను టైటిల్ తో వస్తున్న ఆ సినిమా పూర్తి కాకుండానే వంశీ పైడిపల్లితో సినిమా మొదలు పెడుతున్నాడు మహేష్. అశ్వనిదత్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ గా రెండు పేర్లు వినబడుతున్నాయి. అందులో ఒకటి హరే రామ హరే కృష్ణ మరొకటి కృష్ణా ముకుందా మురారి.  

మహేష్ 25వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. టైటిల్స్ ను చూస్తే ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. తన ప్రతి సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో మంచి ఫలితాలను అందుకుంటున్న వంశీ పైడిపల్లి ఈ సినిమాను కూడా అదే ఫార్ములాతో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. భరత్ అను నేను సూపర్ హిట్ గ్యారెంటీ అని అంటున్నారు. మరి అదే రేంజ్ లో ఈ సినిమా కూడా ఉంటే ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న మహేష్ హిట్ ట్రాక్ ఎక్కేసినట్టే.