
ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ శౌర్య వరుస విజయాలను అందుకుంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. జ్యో అచ్యుతానంద సక్సెస్ తర్వాత కథలో రాజకుమారి సినిమాలో కనిపించి అలరించిన నాగ శౌర్య యువ దర్శకుడు వెంకీ కుడుముల డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా టైటిల్ గా చలో అని పెడుతున్నారట.
యూత్ ఎట్రాక్టివ్ గా ఉన్న చలో టైటిల్ చాలా రేసీ స్క్రీన్ ప్లేతో ఉంటుందని అంటున్నారు. సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ రష్మిక నటిస్తుంది. కిరిక్ పార్టీ సినిమాలో హీరోయిన్ గా నటించి ఓవర్ నైట్ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు నాగ శౌర్య సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. మరి యూత్ ఫుల్ టైటిల్ తో యూత్ ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్న నాగ శౌర్య ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. దాదాపు పూర్తి కావొచ్చిన ఈ సినిమా త్వరలో రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.