
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలలో ఒకరిగా వెలిగిపోతుంది క్రేజీ బ్యూటీ కాజల్. ఈ అమ్మడు లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు లో పరిచయం అయ్యింది. కెరీర్ ఆరంభంలో కొన్ని ఫ్లాపులున్నా వచ్చినా.. అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ పొజీషన్లోకి వెళ్లింది.
ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 లో చాన్స్ కొట్టేసింది. తాజాగా కాజల్ ఫ్యాన్స్ కోసం ఓ బంబర్ ఆఫర్ ఇచ్చింది. తాను అంటే ఎంతగానో అభిమానించే.. ఫ్యాన్స్‌తో డేటింగ్‌కి సిద్ధమని ప్రకటించేసింది. ఇంకేముంది ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. కానీ కండీషన్స్ అప్లై అంటుంది. ఇంతకీ ఆ కండీషన్స్ ఏంటా అనుకుంటున్నారా..! ప్లేస్ అండ్ టైమ్ అమ్మడే నిర్ణయిస్తుందట. ఇక ఫ్యాన్స్‌లో ఒకరిని తనే సెలక్ట్ చేసుకుంటుందట. టైమ్ డ్యురేషన్ కూడా ముద్దుగుమ్మే నిర్ణయిస్తుందట. కాజల్ ఇచ్చిన క్రేజీ ఆఫర్ ఎవరు అందుకుంటారో చూడాలి.