
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ హీరోగా దీపావళికి రిలీజ్ అయిన సినిమా మెర్సల్. అత్లీ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా తమిళనాట రాజకీయాల్లో వేడి పుట్టిస్తుంది. సినిమాలో ఓ పాత్రలో కేంద్ర ప్రభుత్వాన్ని కడిగేసే డైలాగులు చెప్పాడు విజయ్. పెట్రోల్ రేట్లకు జిఎస్టి ఇంకా మెడికల్ ట్యాక్సుల మీద కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా డైలాగులు ఉన్నాయట.
అయితే ఇప్పటికే సినిమాలో ఆ డైలాగులు తీసేయాలంటే అక్కడ బిజెపి నేతలు గొడవ చేస్తున్నారు. అంతేకాదు డాక్టర్స్ కు విరుద్ధంగా సినిమా ఉందని డైరెక్ట్ గా సినిమా పైరసి లింక్ ను డాక్టర్స్ ప్రమోట్ చేస్తున్నారని టాక్ ఉంది. ఈ గొడవలపై తన అభిప్రాయం తెలిపాడు కమల్. సినిమా సెన్సార్ పూర్తి చేసుకునే రిలీజ్ అయ్యింది కాబట్టి సినిమాలో డైలాగులను తీసేయాల్సిన అవసరం లేదని అన్నారు. మొత్తానికి విజయ్ కూడా డైరెక్ట్ గా రాజకీయల్లోకి వస్తాడు అన్న వాదనకు బలం కలిగించేలా మెర్సల్ లో ఆయన పాత్ర తీరుతెన్నులు ఉన్నాయట ఇక నేడో రేపో పార్టీ పెట్టడమో లేక ఉన్న పార్టీలో దూకేయడమో చేస్తాడని కోలీవుడ్ టాక్.