శ్రీనివాస్‌ రెడ్డి మరో ప్రయత్నం..!

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంతో మంది కమెడియన్లు మంచి క్రేజ్ సంపాదించిన తర్వాత హీరోలుగా వచ్చారు.  బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలో చాలా మంది కమెడియన్లు హీరోలుగా వచ్చారు.  కానీ ఎవ్వరూ హీరోలుగా మాత్రం రాణించలేక పోయారు.. తెలుగులో సునీల్ మొదట్లో కాస్త పర్వాలేదనిపించినా ప్రస్తుతం అతని కెరియర్ కూడా అటు ఇటుగా ఉంది. గత కొంత కాలంగా తనదైన కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన శ్రీనివాస రెడ్డి జయమ్ము నిశ్చయమ్ము రా సినిమాతో హీరోగా మారాడు.  

అంతకుముందే అంజలి లీడ్ రోల్ చేసిన హరర్ మూవీ గీతాంజలిలోనూ హీరోగా నటించి మెప్పించారు. ఇక రవితేజ నటించిన రాజా ది గ్రేట్ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రలో కనిపించాడు. రైట్.. రైట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన మను ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా మరో ప్రయత్నం చేస్తున్నాడట. త్వరలో షూటింగ్ ప్రారభం కానున్నదట.. ప్రస్తుతం హీరోయిన్ వేటలో ఉన్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.