
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ తో మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాగా చేస్తున్న మూవీ సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు లుక్ మళ్లీ మారుస్తున్నారట. ఈమధ్య రంగస్థలం సెట్స్ కు వచ్చిన చిరు అదే లుక్ తో సైరాలో కనిపిస్తారని అనుకున్నారు.
కాని మళ్లీ ఏమైందో ఏమో సైరాలో మెగాస్టార్ లుక్ మళ్లీ మార్పులు చేస్తున్నారట. కొత్త లుక్ కోసం మరింత కేర్ తీసుకుంటున్నారట. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్న సైరాకు ఈ కొత్త లుక్ కోసం మరింత లేట్ చేస్తున్నారట. అక్టోబర్ మొదటి వారంలో మొదలు పెట్టాలని అనుకున్నా అది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. మరి సైరా షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.