
విక్టరీ వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కొట్టేసింది మెహ్రీన్ కౌర్. కృష్ణ్గాడి వీర ప్రేమగాథ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన మెహ్రీన్ కౌర్ శర్వానంద్ తో మహానుభావుడుతో కూడా హిట్ అందుకుంది. ఇక ఈ వారం వచ్చిన రవితేజ రాజా ది గ్రేట్ కూడా హిట్ టాక్ తెచ్చుకోవడంతో అమ్మడు హ్యాట్రిక్ హిట్ హీరోయిన్ అయ్యింది. సినిమాలో అమ్మడి పర్ఫార్మెన్స్ సంగతి పక్కన పెడితే ఆమె ఉన్న సినిమా సూపర్ హిట్ అనేస్తున్నారు.
ఇక ఆ సెంటిమెంట్ తోనే ఇప్పుడు అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి. తేజ డైరక్షన్ లో విక్టరీ వెంకటేష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట మెహ్రీన్ కౌర్. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసిన తేజ వెంకటేష్ తో డిఫరెంట్ ప్రయత్నం చేస్తున్నాడట. సురేష్ బాబు, అనీల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తారని తెలుస్తుంది. మరి వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్ తో ఛాన్స్ కొట్టేసిన మెహ్రీన్ ఈ అవకాశాన్ని అన్నివిధాలుగా వినియోగించుకుంటుందేమో చూడాలి.