
రోబో సీక్వల్ గా అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న సినిమా 2.0. శంకర్, రజిని కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ ముందు ఆమీర్ ఖాన్ కు వినిపించాడట శంకర్. కథ విని అద్భుతంగా ఉందని అన్నాడట. కాని సినిమా కథ వింటున్నంతసేపు కథలో హీరో రజినినే ఊహించుకున్నాడట.
రజినికి పెద్ద అభిమాని అయిన ఆమీర్ రజిని నటించిన సినిమా సీక్వల్ లో నటించలేనని చెప్పేశాడట. కేవలం రజిని మాత్రమే రోబో సీక్వల్ చేయాలని అన్నారట. రజినికాంత్ డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడినా సరే అదే విషయం చెప్పాడట. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ విలన్ గా నటించాడని తెలిసిందే. మరి ఆమీర్ ఖాన్ కావాలని మిస్ చేసుకున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.