నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రస్తుతం వేణు శ్రీరాం డైరక్షన్ లో ఎం.సి.ఏ సినిమా చేస్తున్నాడు. ఇక ఇదే కాకుండా మేర్లపాక గాంధితో హను రాఘవపుడితో సినిమాలను లైన్ లో పెట్టాడు నాని. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో సినిమా షురూ అవుతుందట. నాని హీరోగా నేను శైలజ డైరక్టర్ కిశోర్ తిరుమల డైరక్షన్ లో ఓ సినిమా వస్తుందట.
నేను శైలజతో రాం కు హిట్ ఇచ్చిన కిశోర్ తిరుమల మళ్లీ అతనితోనే ఉన్నది ఒకటే జిందగి సినిమా చేశాడు. అది ఈ నెల చివరన రిలీజ్ కాబోతుంది. ఇక కిశోర్ నాని సినిమా కన్ఫాం అయ్యిందట. సినిమా టైటిల్ గా చిత్రలహరి అని పెట్టబోతున్నారట. దూరదర్శన్ లో ఒకప్పుడు పాటల ప్రోగ్రాం టైటిల్ అది.. ఆ టైటిల్ తో చిత్రలహరిగా రాబోతున్నాడు నాని మరి ఈ సినిమాతో మన నాచురల్ స్టార్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.