
స్టార్ మా ప్రెస్టిజియస్ గా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ అనుకున్న రేంజ్ సక్సెస్ అయితే అందుకోగలిగింది. ఇక విన్నర్ గా శివబాలాజి టైటిల్ గెలుచుకున్నాడు. శివ బాలాజి విజయానికి ఓ స్టార్ హీరో ఫ్యాన్స్ కారణమని అందరు అంటున్నారు. అదే కాదు దీనికి ఓ టివి ఛానెల్ కూడా కారణమని అంటున్నారు.
శివ బాలాజిని ప్రమోట్ చేస్తూ అతన్నే సీజన్ వన్ విన్నర్ అయ్యేలా ప్రోత్సహించారట. అంతేకాదు మీడియాలో కూడా శివ బాలాజి ఫాలోవర్స్ ఉన్నారని. ఏకంగా ముంబై మీడియాలో కూడా శివ బాలాజికి తెలిసిన వాళ్లు ఉన్నారన్నది టాక్. ఏది ఏమైనా ఎవరెన్ని ఓట్లేసినా సరే ఫైనల్ గా తెలుగు బిగ్ బాస్ సీజన్ వన్ విన్నర్ శివ బాలాజి నూటికి నూరుపాళ్లు అర్హుడు. టైటిల్ గెలిచాడో లేదో ఎన్నాళ్లనుండో రిలీజ్ చేద్దామనుకున్న తన నిర్మాణంలోని సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు శివ బాలాజి.