
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా త్రివిక్రం కాంబినేషన్ లో సినిమా మార్చిలో మొదలు కానుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా మొదలు కాకుండానే తర్వాత సినిమాకు కథలు వింటున్నాడట తారక్. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ విక్రం కుమార్ డైరక్షన్ లో మూవీ ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం అఖిల్ తో హలో సినిమా చేస్తున్న విక్రం తర్వాత సినిమా జూనియర్ తోనే అంటున్నారు.
జై లవ కుశ తర్వాత కథల విషయంలో మరింత పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్న ఎన్.టి.ఆర్ సినిమా త్రివిక్రం సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. త్రివిక్రం పవర్ స్టార్ తో చేసే సినిమా పూర్తి కాగానే తారక్ తో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి క్రేజీ కాంబినేషన్ గా రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.