
కార్తి హీరోగా పోలీస్ గా నటిస్తున్న సినిమా ఖాకి. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా మరోసారి పోలీస్ సత్తాని తెలియచేస్తుందని చెప్పొచ్చు. వినోద్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను ఆదిత్య మ్యూజిక్ వారు నిర్మిస్తున్నారు. సినిమా ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉంది. కార్తి లుక్ కొత్తగా కనిపిస్తుండగా రకుల్ ఈ సినిమాలో కాస్త రొమాంటిక్ టచ్ ఇచ్చినట్టు ఉంది.
ఖాకిగా కార్తి తన సత్తా చాటిస్తాడని అంటున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకు గిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఓ రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని వస్తున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ అవనుంది. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవబోతున్న ఈ సినిమా కార్తికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ట్రైలర్ తో ఇంప్రెస్ చేసిన కార్తి ఖాకిగా అదరగొట్టడం ఖాయమని అంటున్నారు.